వెంక‌టేష్ అనిల్ రావిపూడి సినిమా ముహూర్త స‌మ‌యం ఇదే!

వెంక‌టేష్ అనిల్ రావిపూడి సినిమా ముహూర్త స‌మ‌యం ఇదే!

Published on Jul 2, 2024 12:29 PM IST

స్టార్ హీరో విక్ట‌రి వెంక‌టేష్ త‌న నెక్ట్స్ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిస్తున్న‌ట్లు అనౌన్స్ చేశారు. ఇప్ప‌టికే ఎఫ్-2, ఎఫ్-3 చిత్రాల‌తో స‌క్సెస్ ఫుల్ కాంబోగా మారిన ఈ ఇద్ద‌రు, ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి సినిమా చేస్తున్నారు. ఇక జూలై 3న ఈ సినిమాను ప్రారంభించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేయ‌గా, తాజాగా ముహూర్త స‌మ‌యాన్ని కూడా ప్ర‌క‌టించారు.

జూలై 3న ఉద‌యం 11.16 గంట‌ల‌కు ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలతో మొద‌ల‌వుతుంద‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తాజాగా తన ట్విట్ట‌ర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ‘భార్య‌, ఎక్స్ కాప్, ఎక్స్ గ‌ర్ల్ ఫ్రెండ్’ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించ‌నున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో మ‌రోసారి ప‌వ‌ర్ఫుల్ పాత్ర‌లో వెంకటేష్ క‌నిపించ‌నున్నాడు.

ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ లు ప్రొడ్యూస్ చేయ‌నున్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు