కమల్ “విక్రమ్” ప్రీ రిలీజ్ వేడుక కి విక్టరీ వెంకటేష్!

Published on May 30, 2022 4:00 pm IST


ఇటీవలి కాలంలో కోలీవుడ్‌లో భారీ అంచనాలున్న సినిమాల్లో విక్రమ్‌ ఒకటి. కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫాహద్ ఫసిల్‌ ప్రధాన పాత్రల్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా విక్రమ్ ను తెరకెక్కించారు లోకేష్ కనగరాజ్. విక్రమ్ నిర్మాతలు రేపు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుండి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించాలని ప్లాన్ చేసారు.

తాజాగా ఈ వేడుకకు స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ కార్యక్రమానికి విక్రమ్ టీమ్ అంతా కూడా హాజరుకానున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ బిగ్గీలో సూర్య పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీతం అందించారు. జూన్ 3, 2022 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :