తమిళంలోకి డబ్ కానున్న వెంకీ ‘బాబు బంగారం’

babu-bangaram
విక్టరీ వెంకటేష్, నయనతారలు జంటగా నటించిన చిత్రం ‘బాబు బంగారం’. జూలై 29న విడుదలవాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాలవల్ల ఆగష్టు 12కు వాయిదా పడింది. యూత్ ఫుల్ డైరెక్టర్ ‘మారుతి’ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తమిళంలో ‘సెల్వి’ పేరుతో ‘భద్రకాళి’ ఫిలిమ్స్ ద్వారా ‘భద్రకాళి ప్రసాద్’ విడుదల చేయనున్నారు. ఇప్పటికే తెలుగులో విడుదలైన ఈ చిత్రం తాలూకు ట్రైలర్లు, ఆడియో జనాలను బాగానే ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాగా తెరెక్కిన ఈ చిత్రానికి ‘గిబ్రాన్’ సంగీతాన్ని అందించగా ‘రిచర్డ్ ప్రసాద్’ సినిమాటోగ్రఫీ అందించారు.