సంపూర్ణేష్ బాబు కి బెస్ట్ విషెస్ తెలిపిన వెంకీ మామ!

Published on Nov 22, 2021 3:00 pm IST

సంపూర్ణేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. సంపూర్ణేష్ బాబు హీరోగా క్యాలీఫ్లవర్ చిత్రం లో నటిస్తున్నారు. ఆర్కే మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మధు సూధన క్రియేషన్స్ మరియు రాధా కృష్ణ టాకీస్ పై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు హీరోగా వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సంపూర్ణేష్ బాబు హీరోగా, వాసంతి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ను నవంబర్ 26 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం సక్సెస్ సాధించాలని కాంక్షిస్తూ విక్టరీ వెంకటేష్ బెస్ట్ విషెస్ తెలిపారు. సంపూర్ణేష్ బాబు కి బెస్ట్ విషెస్ తెలుపుతూ వెంకీ మామ సోషల్ మీడియా లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :

More