వెంకటేష్, తేజ మల్టి స్టారర్ సినిమా డీటెయిల్స్


‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత మళ్లీ తేజ డైరెక్ట్ చేయనున్న సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించనున్న సంగతి తెలిసిందే, తేజ చెప్పిన కథ నచ్చడంతో వెంకీ వెంటనే ఈ సినిమాకు సైన్ చేశాడట. నవంబర్ రెండోవారంలో ఈ సినిమా ప్రారంభం కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.

ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో హీరో నటించబోతున్నాడు, నారా రోహిత్ కాని సుమంత్ కాని ఎవరో ఒకరు నటించే అవకాశం ఉంది, త్వరలో ఈ విషయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అనుప్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అనుష్క హీరొయిన్ గా ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటు తేజ ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసింది.