సల్మాన్ ఖాన్ చిత్రంలో వెంకటేష్ జాయిన్ అయ్యేది అప్పుడే!

Published on May 31, 2022 4:25 pm IST


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తదుపరి కబీ ఈద్ కబీ దీవాలి లో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తన తాజా చిత్రం F3 విజయాన్ని ఆస్వాదిస్తున్న వెంకటేష్, జూన్ 10, 2022న హిందీ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌ లోని ఆచార్య టెంపుల్ సెట్‌లో ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :