పోనీ పోనీ లిరికల్ సాంగ్ ఆనాటి స్వర్ణ కమలం రోజుల్ని గుర్తు చేసింది – వెంకటేష్

Published on Sep 29, 2021 11:32 am IST

విక్టరీ వెంకటేష్ తాజాగా నాట్యం సినిమా నుండి పోనీ పోనీ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు. ఈ మేరకు సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నాట్యం అంటే ఒక కథ ను అందంగా చెప్పడం అంటూ చెప్పుకొచ్చారు. ఈ పాట స్వర్ణ కమలం రోజుల్ని గుర్తు చేసింది అంటూ ఏమోషనల్ అయ్యారు.

రేవంత్ కోరుకొండ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిశ్రింకల బ్యానర్ పై ఈ చిత్రాన్ని సంధ్య రాజు నిర్మిస్తున్నారు. దర్శకత్వం తో పాటుగా కథ, కెమెరా, ఎడిటింగ్ బాధ్యతలను సైతం దర్శకులు నిర్వహిస్తున్నారు. కరుణాకర్ అదిగర్ల రచించిన ఈ పోనీ పోనీ అనే పాటను లలిత కావ్య పాడటం జరిగింది. ఈ చిత్రం లో సంధ్య రాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పోనీ పోనీ లిరికల్ సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :