లేటెస్ట్…ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో వెంకటేష్ – అనిల్ రావిపూడి చిత్రం అనౌన్స్ మెంట్!

లేటెస్ట్…ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో వెంకటేష్ – అనిల్ రావిపూడి చిత్రం అనౌన్స్ మెంట్!

Published on Jul 1, 2024 8:15 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చివరిసారిగా సైంధవ్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. వెంకటేష్ తదుపరి ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. స్టార్ డైరెక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. మేకర్స్ నేడు సరికొత్త పోస్టర్ ద్వారా చిత్రాన్ని ప్రకటించడం జరిగింది.

రిలీజ్ చేసిన పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక గన్ కి తాళిబొట్టు ను మరియు రోజా పువ్వును జత చేసి ఉంది. సినిమా పై ఈ పోస్టర్ మరింత ఆసక్తి ను పెంచుతోంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా SVC58 అనే టైటిల్ ను పెట్టడం జరిగింది. జూలై 3 వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభం కనున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు