ప్రారంభమైన వెంకటేష్ నూతన చిత్రం !
Published on Dec 4, 2017 1:06 pm IST

‘గురు’ సినిమా తరువాత వెంక‌టేష్ తేజ దర్శకత్వంలో నటించబోతున్న సినిమా ఈరోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. దేవుని చిత్ర పటాలపై వెంకటేష్ క్లాప్ కొట్టడం జరిగింది. పరుచూరి బ్రదర్స్ , రానా, చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు జీవ నటించిన ‘కీ’ సినిమా కెమెరా మెన్ అభినందన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. సురేష్ బాబు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. చాలా కథలు విన్న తరువాత వెంకటేష్ ఈ కథను ఒకే చేసినట్లు సమాచారం.

 
Like us on Facebook