టాలెంటెడ్ డైరెక్టర్ తో వెంకటేష్ 75 వ చిత్రం!

Published on Jan 23, 2023 11:11 am IST

స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ గతేడాది ఎఫ్3 తో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు, నటుడు తన 75 వ చిత్రం కోసం మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఇటీవలే హిట్ 2తో భారీ హిట్‌ని అందించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ ల్యాండ్‌మార్క్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్యామ్‌ సింఘరాయ్ కి మద్దతుగా నిలిచిన నిహారిక ఎంటర్టైన్‌మెంట్స్‌ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

జనవరి 25, 2023న పెద్ద అప్డేట్ వస్తుందని ప్రకటించడానికి మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నిహారిక ఎంటర్టైన్‌మెంట్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. వెంకటేష్‌కి ఇది నిజంగానే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అవుతుంది. పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ యాక్షన్ మూవీ అనౌన్స్ మెంట్ తోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం లో భాగం అయ్యే అవకాశం ఉంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు మేకర్స్.

సంబంధిత సమాచారం :