మరో హిట్ రీమేక్‌కి రెడీ అయిన వెంకీ మామ?

Published on Sep 9, 2021 2:00 am IST


విక్టరీ వెంకటేశ్ మరో హిట్ రీమేక్‌కి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇటీవల అసురన్ రీమేక్‌గా వచ్చిన ‘నారప్ప’ ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకోగా, ఇందులో వెంకీ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్న వెంకీ మామ త్వరలో తమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన సూపర్ హిట్ ‘ఎన్నై అరిందాల్’ రీమేక్‌లో హీరోగా చేయబోతున్నాడని టాక్.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2015లో వచ్చిన ఈ సినిమా తెలుగులో ‘ఎంతవాడుగానీ’ పేరుతో డబ్ అయ్యి అక్కడ, ఇక్కడ మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేయాలని నిర్మాత సురేష్ బాబు అనుకుంటున్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :