బాలక్రిష్ణ కోసం సినిమాను వాయిదావేసిన వెంకీ ?

ఇటీవలే ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కిన దర్శకుడు తేజ ఒకవైపు బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కిస్తూనే మరోవైపు వెంకటేష్ హీరోగా ఒక చిత్రాన్ని ప్రారంభించారు. ఒత్తిడి ఉన్నా ఈ రెండు ప్రాజెక్ట్స్ కు సంబందించిన షూటింగ్ కూడా ఒకేసారి చేయాలనీ తేజ గతంలో ప్లాన్ చేసుకున్నారు.

కానీ ఇది గమనించిన వెంకటేష్ ఒత్తిడి మధ్య రెండు సినిమాలను ఒకేసారి నడపడం మంచిది కాదని, బాలక్రిష్ణ సినిమా అయ్యాకే తన సినిమా చేయమని సలహా ఇచ్చారట. అంతేగాక ఈ గ్యాప్ లో పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయాలని స్క్రిప్ట్ కూడా వింటున్నారట. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.