యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘రానా నాయుడు’ ట్రైలర్‌

Published on Feb 15, 2023 10:35 pm IST


తొలిసారిగా దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇక ఈ సిరీస్ యొక్క ట్రైలర్ ని నేడు ముంబై లో గ్రాండ్ గా లాంచ్ చేసారు. సుందర్ ఆరోన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్ ని కరణ్ అన్షుమన్, సుపర్న్ ఎస్ వర్మ తెరకెక్కించారు. ఇక ఈ ట్రైలర్ యాక్షన్ మరియు థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్ లో వెంకటేష్ దగ్గుబాటి ఇంటెన్స్ పాత్రలో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసాదారణ శక్తితో మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ని అందిస్తూ మరింత ఆసక్తిని పెంచారు. ఆయన పాత్ర చిత్రీకరణ ఎంతో బాగుంది. వెంకటేష్ పోషించిన నాగ పాత్ర హైదరాబాదీ తేజ్ దమ్ కా చాయ్ లాగా ఉంది. ఫుల్ జోష్, ఫుల్ ఎనర్జీతో ఈ పాత్ర కనపడుతోంది. వెంకటేష్, రానా తండ్రి కొడుకులుగా నటించిన ఈ సిరీస్ ని ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ వారు మార్చి 10న పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ, రానా నాయుడు లాంటి ఎగ్జైటింగ్ షో కోసం మొదటిసారిగా మా అన్నయ్య గారి అబ్బాయితో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు థ్రిల్‌గా అనిపించింది. నాగ పాత్రను పోషించడం నాకు పూర్తిగా కొత్త అనుభవం. నేను ఇంతకు ముందు ఇలాంటి పాత్రలో నటించలేదు. నాగ ఒక రిఫ్రెష్ గా అనిపించింది.ఈ పాత్ర ఒకింత థ్రిల్లింగ్ గా అలానే లేయర్లుగా వుంటుంది. ఇది చూసిన తరువాత నా అభిమానులు ఏం చెబుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు చాలా విధాలుగా కొత్తది. ఈ సిరీస్‌లో ప్రతిభావంతులైన దర్శకులు, నిర్మాతల బృందంతో కలిసి పనిచేయడం నిజంగా అద్భుతమైన అనుభవం. తప్పకుండా ఇది మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేసారు.

రానా దగ్గుబాటి మాట్లాడుతూ, బాబాయ్ తో అలానే నెట్‌ఫ్లిక్స్‌తో మొదటిసారి కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రత్యేకమైనది. ఈ ప్రాజెక్ట్‌లో ఆరోన్, అన్షుమాన్, వర్మ లతో కలిసి పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. మొత్తం ఆర్టిస్టులు, టీం అందరూ ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. రానా నాయుడు పాత్రను పోషించడం ఒక సవాలుగా అనిపించింది. అతను తన కుటుంబంతో లోతైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్న సంక్లిష్టమైన పాత్ర, అదే సమయంలో తన తండ్రితో అతని సంబంధంతో కూడా పోరాడే పాత్ర. రానా, నాగ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రపంచాన్ని అందరూ ఎక్స్ పీరియన్స్ చేయడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. అలానే తప్పకుండా రానా నాయుడు మీ అందరినీ ఆకట్టుకుంటాడని అన్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :