వెంకీ, రవితేజల.. మల్టీస్టారర్!

Venkatesh,-Ravi-Teja
ఈమధ్య కాలంలో తెలుగులో మల్టీస్టారర్ల హవా ఎక్కువైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మళ్ళీ ఊపందుకున్న ఈ ట్రెండ్.. ఆ తర్వాత వరుస సినిమాలతో కొనసాగుతోంది. తాజాగా ఈ మల్టీస్టారర్ జాబితాలోకి వెంకటేష్, రవితేజల కాంబినేషన్ వచ్చిపడింది. విజయ్, మోహన్‌లాల్‌లు నటించిన తమిళ సినిమా ‘జిల్లా’ రీమేక్‌లో వీరిద్దరూ నటిస్తున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. గత సంవత్సరం పొంగల్‌కు విడుదలైన జిల్లా సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.

జిల్లా తెలుగు రీమేక్‌కు ‘దూసుకెళ్తా’ ఫేం వీరుపోట్ల దర్శకత్వం వహించనున్నారు. ఎప్పట్నుంచో వెంకీ, రవితేజల కాంబినేషన్‌ తెరపైకి వచ్చినా.. సరైన స్క్రిప్ట్ కోసం వాళ్ళిద్దరూ ఎదురు చూశారు. ఇప్పుడీ జిల్లా కథైతే వారికి సరిగ్గా నప్పుతుందనే ఆలోచనలో వీరుపోట్ల ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే తెలుగు రీమేక్‌కు కొన్ని మార్పులు చేస్తున్నారు.

వెంకటేష్ నటించిన ‘గోపాల గోపాల’ ఈ సంక్రాంతికి విడుదలై మంచి మార్కులే సంపాదించుకోగా, రవితేజ ‘కిక్ 2’ లాంటి క్రేజీ సినిమాతో మన ముందుకు రానున్నాడు. కిక్ 2 తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

Exit mobile version