‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం వెంకటేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Venkatesh

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఈ సినిమాలో మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఓ క్యామియో పాత్రలో నటిస్తుండటంతో చిరుతో ఆయన కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే, ఈ సినిమాలో వెంకటేష్ (Venkatesh) దాదాపు 25 నిమిషాలపాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతున్నాడని మేకర్స్ చెబుతున్నారు. కాగా, ఈ సినిమా కోసం ఆయన ఎంతమేర రెమ్యునరేషన్ తీసుకున్నాడా..? అనే విషయంపై ఓ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం వెంకటేష్ (Venkatesh) దాదాపు 15 రోజుల పాటు షూటింగ్ చేశారని.. ఈ సినిమా కోసం ఆయన రూ.9 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారని చిత్ర వర్గాల సమాచారం. ఈ సినిమాలో చిరుతో పాటు ఆయన చేసే సీన్స్ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తాయని.. అంతేగాక, ఆయన ఓ సాంగ్‌లో కూడా కనిపిస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తానికి చిరు-వెంకీ మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకే హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version