ఇంటర్వ్యూ: విక్టరీ వెంకటేష్ – సాధారణ ప్రేక్షకుల కోసమే ఈ సినిమా చేశాను !


విక్టరీ వెంకటేష్ చేస్తున్న మరొక ప్రయోగాత్మక చిత్రం ‘గురు’. తమిళ చిత్రం ‘ఇరుద్ది సుత్రు’ కు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సుధా కొంగర డైరెక్ట్ చేశారు. ఫస్ట్ లుక్ తోనే అందరిలోనూ మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ చిత్రం మార్చి 31న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా వెంకీ మీడియాతో ముచ్చటించారు . ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా గురించి, మీ కెరీర్ గురించి చెప్పండి ?

జ) నేను ఒక క్రమశిక్షణతో నడుచుకునే నటుడ్ని. ప్రతి రోజు కష్టపడి పని చేస్తాను. మంచి సబ్జెక్ట్స్ కోసం చూస్తుంటాను. సినిమా కోసం నాకు సాధ్యమైన కృషి మొత్తం చేస్తాను. డిఫరెంట్ స్టోరీ కోసం చూస్తున్న సమయంలో ఈ సినిమా వచ్చింది. ఎంతో అగ్రెసివ్ గా ఉండే పాత్ర. నా వయసుకు సరిపోయే కథ. ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. కానీ రెండో సారి వాటిని రిపీట్ చేయకూడదు. లైఫ్ లో ఏదైనా సరే పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు అనుకుంటాను.

ప్ర) రీమేక్ చేసేప్పుడు కథ కష్టంగా ఉంటుందా, పాత్ర కష్టంగా ఉంటుందా ?
జ) ఆ రెండూ కలిసే ఉంటాయి. సినిమా బిజినెస్ కాబట్టి ముందు సేఫ్ జోన్ చూసుకుని వెళ్ళాలి. సినిమాలో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. వాటిని కరెక్ట్ గా కనెక్ట్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది. ఒకరు ముందుగానే చేసిన పాత్రను మళ్ళీ నేను చేయడమంటే చాలెంజింగానే ఉంటుంది. అక్కడ పాసవడమే ఒక ఛాలెంజ్.

ప్ర) ఇందులో పాత్ర చాలా ఎగ్రెసివ్ గా ఉంటుంది. అందులో ఎలా మోల్డ్ అయ్యారు ?
జ) మనం చిన్నప్పటి నుండి చాలా మంది కఠినమైన మనుషుల్ని చూసుంటాం. టీచర్స్ లాంటి వాళ్ళు. వాళ్లకు సపరేట్ టెక్నీక్స్ ఉంటాయి. సినిమాల్లో కూడా చాలా మంది కోచ్లను చూశాం. అందుకే నాకు కథనంగా మారడానికి పెద్ద సమయం పట్టలేదు. ఇక నా లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంటుంది. ఇంతకూ ముందెప్పుడూ చేయనిది. అది అందరికీ చాలా బాగా నచ్చింది. దీని కోసం 5, 6 నెలలు బాక్సింగ్ నేర్చుకున్నాను. చాలా స్టేబులే గా చేశాను. సినిమాలో నా పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో ఊహించడం కష్టం.

ప్ర) ఇండస్ట్రీలో మీరు చూసిన మార్పులు ఏంటి ?
జ) ఇక్కడ ఎలాంటి చేంజెస్ జరగలేదు. ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. ఆ మార్పుకు అనుగుణంగా మనం కూడా మారాలి. ఆ మార్పుకు తగ్గట్టే సినిమాలు చేయాలి. ఇంకా ఇక్కడే ఉండి మారలేదు అనుకుంటే పొరపాటు.

ప్ర) డైరెక్షన్ గానీ, రియాలిటీ షోలు గానీ చేస్తారా ?
జ) చేయను. ఇప్పుడవన్నీ ఒద్దనుకుంటున్నాను. చాలా మంది చేస్తున్నారు. అది వాళ్ళ కంఫర్ట్. నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే వాటన్నింటి గురించి ఆలోచించే టైమ్ లేదు. నాకు వ్యక్తిగత పనులు చాలా ఉన్నాయ్.

ప్ర) సినిమా మ్యూజిక్ గురించి చెప్పండి ?
జ) మ్యూజిక్ చాలా గొప్పగా వచ్చింది. అన్నీ పాటలు బాగా వచ్చాయి. సక్కనోడా పాట విజువల్స్ కొత్తగా ఉంటాయి.

ప్ర) ఇండస్ట్రీలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఎక్కువయ్యాయి కదా మంచిదేనా ?
జ) ఇది మంచిది కాదు. చాలా ఇబ్బందులుంటాయి. మార్కెట్ అన్నీ చూసుకోవాలి. వేరే వాళ్ళతో పోల్చుకుంటే పొరపాట్లు జరుగుతాయి. కథ డిమాండ్ చేస్తే ఖర్చు పెట్టాలి. నా వరకు నిర్మాతలు నష్టపోకుండా చూడాలి అనుకుంటాను. రిస్క్ లేకుండా సినిమా చేయాలనుకుంటాను.

ప్ర) చాలా స్పోర్ట్స్ ఫిలిమ్స్ వచ్చాయి. చాలా వాటిని ఆదరించారు. మీ సినిమా కూడా లానే ఉంటుందా ?
జ) అంటే స్పోర్ట్స్ సినిమాలు చాలా వచ్చాయి. వాటిలో కొన్ని పోయాయి కొన్ని హిట్టయ్యాయి. కానీ సినిమాలో ఎమోషన్ అనేది ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా హిట్టవుతుంది. ఒకరు చైనా స్థాయి నుండి వచ్చి పెద్ద విజయం సాధించడం లాంటి వాటికి ప్రేక్షకులు బాగా కనెక్టవుతారు. సినిమాలో అలాంటి పాయింట్స్ చాలా ఉన్నాయి.

ప్ర) ఇంతకు ముందే రెండు భాషల్లో వచ్చింది. మళ్ళీ ఎందుకు చేయాలనిపించింది ?
జ) సినిమాని చల్ మంది చూసారని మీరనుకుంటున్నారు. కానీ చాలా మంది ఇంకా చూడలేదని నేననుకుంటున్నాను. ఆ ధైర్యంతోనే చేశాను. సినిమా చూసేప్పుడు సాధారణ పబ్లిక్ క్లీన్ హార్ట్ తో సినిమాకు వస్తారు. వాళ్ళే అందులో ఎమోషన్స్ ని ఎంజాయ్ చేస్తారు. ఫాన్స్, క్రిటిక్స్ ఫైవ్ పెర్సెంట్ ఉంటారు. మిగతా వాళ్ళు 95 % ఉంటారు. వాళ్ళ కోసమే చేయాలి. చాలా ఏళ్ల తర్వాత వెంకీ కొత్త రోల్ లో కనిపిస్తున్నాడు, మొదటి తెలుగు స్పోర్ట్స్ డ్రామా కాబట్టి చూస్తారు.

ప్ర) నెక్స్ట్ ఎలాంటి సినిమాలు, పాత్రలు చేయాలనుకుంటున్నారు ?
జ) పలానా సినిమా చేస్తానని నేను అనుకోవడంలేదు. కొన్ని సబ్జక్ట్స్ ఉన్నాయి. ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ ఉంది. దాన్నే చేయాలని అనుకుంటున్నాను. త్వరలో అనౌన్స్ చేస్తాను.

ప్ర) రానా గురించి చెప్పండి ?
జ) చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం. 17 ఏళ్ళ వయసులోనే విఎఫ్ఎక్స్ బిజినెస్ చేసేవాడు. నాకన్నా ఎక్కువగా అందరితో పరిచయాలున్నాయి. చాలా నేర్చుకున్నాడు. మెదటి సినిమా ‘లీడర్’ చాలా బాగా చేశాడు. ఇక ‘ఘాజి’ తో అయితే ఇంకా బాగా మెప్పించాడు. త్వరలో రాబోయే ‘నేనే రాజు నేనే మంత్రి’ తో తనలోని పూర్తి నటుడు బయటపడతాడు.