వెంకటేష్, తేజ సినిమా లేటెస్ట్ న్యూస్ !

హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ఆటా నాదే వేటా నాదే’ అనే డిఫరెంట్ టైటిల్ ప్రచారంలో ఉంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జనవరి 26 నుండి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

50 సినిమాలకు సక్సెస్ ఫుల్ గా సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా మంచి కథ కథనాలతో తెరకేక్కబోతోంది. ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటుల వివరాలు మరికొన్ని రోజుల్లో చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.