వెంకటేష్ & తేజ సినిమా ముహూర్తం డేట్ ఖరారు !
Published on Dec 2, 2017 6:42 pm IST

అబ్బాయి రానాకు నేనేరాజు నేనేమంత్రి సినిమాతో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు తేజ ఇప్పుడు బాబాయి వెంకటేష్ తో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. ఆటానాదే వేటనాదే అనే టైటిల్ ఈ సినిమాకు ఖరారు చేసారు. అనుప్ రూబెన్స్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రారంభం కానుంది.సురేష్ ప్రొడక్షన్ లో నిర్మించబడుతున్న ఈ సినిమా కు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ముగ్గురు కథానాయికలు నటించబోయే ఈ సినిమాలో మరో హీరో ప్రదాన పాత్రలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వెంకటేష్ హిట్ కొట్టడం గ్యారెంటి అని ఫిలిం నగర్ టాక్. ఈ ప్రాజెక్ట్ లో నటించబోయే హీరోయిన్స్ పేర్లు రకరకాలుగా వినపడుతున్నా ఆఫీసియల్ న్యూస్ లేదు.

 
Like us on Facebook