తమిళ హీరో విశాల్ కొన్నేళ్ల కిందట నటించిన సినిమా ‘మదగజరాజ’ రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సుందర్ సి డైరెక్ట్ చేయగా ఇది తమిళ బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని విధంగా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టడం తో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తమిళ్‌లో భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు మేకర్స్ ఈ మూవీని తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేసి సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ చిత్ర ట్రైలర్‌ను స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా జనవరి 25న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో విశాల్ సరసన అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోని సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో జనవరి 31న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.