స్వాతి ముత్యం డైరెక్టర్ తో వెంకటేష్ మూవీ ?

స్వాతి ముత్యం డైరెక్టర్ తో వెంకటేష్ మూవీ ?

Published on Oct 24, 2022 7:00 AM IST

స్వాతిముత్యం డైరెక్టర్ లక్ష్మణ్ కె కృష్ణ, వెంకటేష్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వెంకటేష్ కి లక్ష్మణ్ కె కృష్ణ ఓ కథ చెప్పాడని, వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇది పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ డ్రామా అని, భార్యాభర్తల మధ్య ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. మిస్ అయిపోయిన తన భార్య కోసం ఒక భర్త పడే తపన, ఆవేదన ఈ సినిమా అని తెలుస్తోంది.

అయితే, ఈ ఎమోషనల్ డ్రామాలో కూడా మంచి ఫన్ ఉంటుందట. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ స్టార్ వెంకీకి లక్ష్మణ్ కె కృష్ణ కామెడీ కలిస్తే ఇంట్రెస్ట్ గా ఉంటుంది. నిర్మాత సురేష్ బాబు, వెంకటేష్ హీరోగా ఈ సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడట. మొత్తానికి వెంకటేష్ ఇమేజ్ కోసం లక్ష్మణ్ కె కృష్ణ బలమైన కథ రాశాడట. ఏది ఏమైనా వెంకటేష్ సినిమాల పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు