వెంకటేష్ తో ‘శ్రీకాంత్ అడ్డాల’ ఎమోషనల్ డ్రామా ?

Published on Jul 19, 2022 2:00 am IST

క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, వెంకటేష్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వెంకటేష్ కి శ్రీకాంత్ అడ్డాల ఓ కథ చెప్పాడని, వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇది పక్కా ఫ్యామిలీ డ్రామా అని, తండ్రికూతుర్ల మధ్య ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. మిస్ అయిపోయిన ఓ కూతురు కోసం ఒక తండ్రి పడే తపన, ఆవేదన ఈ సినిమా అని తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు.

కాకపోతే నిర్మాత సురేష్ బాబు, వెంకటేష్ హీరోగా ఈ సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడట. మొత్తానికి వెంకటేష్ ఇమేజ్ కోసం శ్రీకాంత్ బలమైన కథ రాశాడట. ఆ మధ్య శ్రీకాంత్ అడ్డాల బాలయ్యతో సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వెంకటేష్ అయితేనే తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం జరుగుతుందని శ్రీకాంత్ అడ్డాల ఫీల్ అవుతున్నాడట. ఏది ఏమైనా వెంకటేష్ సినిమాల పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :