గత ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాడు సీనియర్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్. దాంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. అయితే ఆ గ్యాప్ ను కవర్ చేసేందుకు వెంకీ వరుసగా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నలల్ ఇస్తున్నాడు. అందులో భాగంగా ‘జై లవ కుశ’ ఫేమ్ బాబీ దర్శకత్వంలో యువ హీరో నాగ చైతన్య తో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నాడు వెంకీ. ‘వెంకీ మామ’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రం తరువాత వెంకీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఇవి కాక వెంకీ కోసం అనిల్ రావిపూడి అలాగే ఇతర దర్శకులు మరికొన్ని కథలను సిద్ధం చేస్తున్నారట.
ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ , వరుణ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం ‘ఎఫ్ 2’ ఈనెల 12న విడుదలకానుంది. ఔట్ అండ్ అవుట్ కామెడీ ఎంటెర్టైనెర్ గా రానున్న ఈ చిత్రం ఫై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిర్మాత దిల్ రాజు కి కూడా ఈ చిత్ర విజయం చాలా కీలకం కానుంది.
