రిలీజ్ డేట్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న సీనియర్ హీరో !

22nd, November 2016 - 08:35:05 AM

guru

సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ తన తరువాతి చిత్రం ‘గురు’ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అన్ని విషయాలని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ డేట్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. ముందుగా డిసెంబర్ నెలలో చిత్రాన్ని రిలీజ్ చేద్దామని అనుకున్నా కూడా తరువాత దాన్ని సంక్రాంతికి వాయిదా వేశారు. కానీ సంక్రాంతి బరిలో కూడా చిరంజీవి 150వ చిత్రం ‘ఖైధీ నెం 150’, బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి పెద్ద సినిమాలు పోటీకి దిగుతుండటంతో సేఫ్ గా ఉంటుందని, సెలవు దినం కలిసిసొస్తుందని రిలీజ్ ను జనవరి 26 రిపబ్లిక్ డే కు వాయిదా వేశారు.

ఇప్పటికే వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రసుతం చెన్నైలో ఒక షెడ్యూల్ షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తి కావోస్తుండటంతో యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద కూడా దృష్టి పెట్టింది. ప్రమోషన్లను కూడా భారీ ఎత్తున చేయాలని అనుకుంటోంది. ‘సాలా ఖదూస్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఒరిజినల్ వర్షెన్ ని డైరెక్ట్ చేసిన సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో వెంకీ ఒక బాక్సింగ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు.