వెంకటేష్ నెక్స్ట్ సినిమాకు వెరైటీ స్టోరీ లైన్

Venkatesh
‘బాబు బంగారం’ సినిమాతో మంచి విజయాన్నందుకున్న విక్టరీ వెంకటేష్ వెరైటీ కథల్ని ఎంచుకుంటూ పాత వెంకీని గుర్తుచేస్తున్నారు. తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో బాలీవుడ్ ‘సాలా ఖాదూస్’ కు రీమేక్ గా ‘గురు’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు వెంకీ. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ నిన్ననే మొదలైంది. ఈ చిత్రం డిసెంబర్ నెలలో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తవగానే వెంకీ మరో చిత్రాన్ని ప్రారంబించనున్నాడు. ఇది కూడా లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. దీనికి ‘ఆడవాళ్లు మీకు జోహారులు’ అనే ఫన్నీ, వెరైటీ టైటిల్ ను నిర్ణయించారట. ఈ చిత్రాన్ని ‘నేను శైలజా’ ఫేమ్ కిశోర్ తిరుమల డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో వెంకీ సరసన నిత్యా మినన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే వెనకే ప్రస్తుతం చేస్తున్న గురు చిత్రం తాలూకు ఫస్ట్ లీక్ పోస్టర్లు కొద్ది రోజుల క్రితమే విడుదలై మంచి స్పందన తెచ్చుకుని సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.