సోషియో ఫాంటసీకి ఓకే చెప్పిన వెంకటేష్ !

Venkatesh
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ మధ్య కొంచెం రూటు మార్చి ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం, గురు’ వంటి సినిమాలే అందుకు నిదర్శనాలు. ఈ బాటలోనే వెంకీ ప్రస్తుతం మరో ప్రయోగాత్మక చిత్రానికి ఓకే చెప్పినట్టు సినీ వర్గాల సమాచారం. ఈ సినిమా పూర్తిగా సోషియో ఫాంటసీ నైపథ్యంలోి ఉండనుందని కూడా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసేది మరెవరో కాదు భిన్న చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన క్రిష్. ‘కంచె, కృష్ణవందే జగద్గురుమ్, గమ్యం, వేదం’ వంటి సినిమాలతో ఇప్పటికే తన వైవిధ్యాన్ని చాటుకున్న క్రిష్ ప్రస్తుతం బాలయ్య 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ను డైరెక్ట్ చేస్తున్నాడు.

కొద్దిరోజుల క్రితమే క్రిష్ వెంకటేష్ కు ఈ సోషియో ఫాంటసీ కథను వినిపించగా వెంకీ కూడా కథ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వెంకీ ప్రస్తుతం ‘గురు’ షూటింగును పూర్తి చేసి ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల డైరెక్షన్లో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాకి సిద్దమవుతున్నాడు. ఈ సినిమా పూర్తైన వెంటనే క్రిష్ సినిమా మొదలవుతుందని అంటున్నారు. అయితే ఈ విషయంపై క్రిష్, వెంకటేష్ ల నుండి ఎలాంటి అధికారిక సమాచారం ఇప్పటి దాకా బయటకు రాలేదు.