మెగాస్టార్ తో సినిమాపై వెంకీ అట్లూరి బిగ్ ప్రామిస్!

మెగాస్టార్ తో సినిమాపై వెంకీ అట్లూరి బిగ్ ప్రామిస్!

Published on Sep 3, 2026 1:24 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొల్లి బాబి కాంబినేషన్లో కాకా అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కాకుండా దర్శకుడు వశిష్టతతో విశ్వంభర అలాగే దర్శకుడు శ్రీకాంత్ వదలతో మరో సినిమా మెగాస్టార్ ఖాతాలో ఉన్నాయి. అయితే ఈ అన్ని సినిమాలు కాకుండా ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్న సక్సెస్ఫుల్ దర్శకుడు వెంకీ అట్లూరి తో కూడా ఒక సినిమా ఉన్నట్టుగా ఆ మధ్య టాక్ వచ్చింది వెంకీ కూడా సానుకూలంగా దీనిపై స్పందించడం జరిగింది.

ఇక లేటెస్ట్ గా మరో క్రేజీ క్లారిటీని వెంకీ అట్లూరి చిరంజీవితో సినిమాపై అందించడం జరిగింది. తమ కాంబినేషన్లో సినిమాకి కొంచెం సమయం పడుతుంది అని ముఖ్యంగా తనకి ఈ సినిమా పట్ల కొంత సమయం కావాలని తెలిపారు. అలాగే ఇది వెంకీ అట్లూరి సినిమాలా కాకుండా ప్రాపర్ గా చిరంజీవి సినిమాలో ఉంటుందని కూడా బిగ్ ప్రామిస్ చేశాడు. సో వీరి కాంబినేషన్లో ఒక పక్కా మెగాస్టార్ సినిమా చూడబోతున్నామని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు