దుల్కర్ సల్మాన్‌తో సినిమా పై వెంకీ అట్లూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on May 16, 2023 4:42 pm IST


ఇటీవల తన ద్విభాషా చిత్రం సార్/వాతితో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి, తన తదుపరి చిత్రం మాలీవుడ్ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్‌తో ఉంటుందని ఇటీవల ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ, ఇకపై ప్రేమకథలే తీయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

తన తదుపరి సినిమా కథాంశం నార్త్ ఇండియాకి ముడిపడి ఉంటుందని ఆయన అన్నారు. గాసిప్ ప్రకారం, ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా ఉండనుంది. పాన్ ఇండియన్ మూవీని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది, మరియు శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తుంది. ఈ చిత్రాన్ని 2024 సమ్మర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం :