స్పెషల్ వీడియో : వెంకీ బర్త్ డేకి ‘ఎఫ్ 3’ నుంచి సర్ ప్రైజ్ !

Published on Dec 13, 2021 10:22 am IST

‘విక్టరీ’ వెంకటేష్ దగ్గుబాటి జన్మదినం నేడు. అయితే, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, యంగ్ హీరో వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వెంకీ పుట్టినరోజు సందర్భంగా వెంకటేష్ మీద ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది ఎఫ్ 3 టీమ్. వీడియోలో.. వెంకీ చేతిలో డబ్బుతో ముస్లిమ్ రాజుల కాలం నాటి గెటప్ లో తన లుక్ తో వెంకీ ఆకట్టుకున్నారు.

తెలుగు వెండితెర పై ఎన్నో మరపురాని ఘన విజయాలను నమోదు చేసిన ‘విక్టరీ’ వెంకటేష్ నుంచి రాబోతున్న ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్ 3’. ఇక ‘ఎఫ్ 3’ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా. పైగా ఈ చిత్రంలో వెంకటేష్‌ పాత్రకు రేచీకటి. ఇక వరుణ్ పాత్రకు నత్తి. ఈ సమస్యలతో F3 కథ ఎలా సాగుతుంది ? కథ పాత్రలను ఎలా నడిపిస్తాయి ? అనే కోణంలో ఈ సినిమా ఉంటుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :