చిరంజీవికి పోటీగా వెంకటేష్ దిగుతున్నాడు ?
Published on Nov 9, 2016 9:20 am IST

khaidi-150-guru
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ‘ఖైధీ నెం 150’ పట్ల ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందన్న నమ్మకం సినీ వర్గాల్లో గట్టిగా ఉంది. ఎందుకంటే చిరు 9 ఏళ్ల తరివాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. అలాగే సంక్రాంతికి ఇంకొన్ని పెద్ద సినిమాలు కూడా రావాల్సి ఉంది. దీంతో అందరిలోనూ చిరు సినిమాకి పోటీగా ఎవరు బరిలోకి దిగుతారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

నాన్న మొన్నటి దాకా చిరుకు పోటీగా బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో దిగుతాడని అనుకుంటుంటే ఇప్పుడు మరో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పేరు కూడా వినిపిస్తోంది. వెనకటేష్ ‘ఇరుద్ది సుత్తురు’ అనే తమిళ సినిమాని తెలుగులోకి ‘గురు’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. కొన్ని రోజులో వైజాగ్ లో క్లైమాక్స్ భాగం చిత్రీకరణ జరుపుకోనుంది ఈ చిత్రం. మొదట డిసెంబర్ నెలలో ఈ సినిమాని రిలీజ్ చేస్తారని అనుకున్న ఇప్పుడు సంక్రాంతికి అదీ ఖైధీ నెం 150 రిలీజ్ రోజునే వెంకీ సినిమా రిలీజ్ ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్త ప్రకారం వెంకీ చిరుకి పోటీగా సంక్రాంతి బరిలోకి దిగుతాడో లేదో చూడాలి.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook