చిరు కోసం వెంకీ అలా ప్లాన్ చేశాడా?

Published on Feb 23, 2022 2:30 am IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో చేసిన “ఆచార్య” చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న “గాడ్ ఫాదర్” చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చొంది. మరోవైపు మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్”, ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఇక వీటి తర్వాత వెంకీ కుడుముల చిత్రం పట్టాలెక్కనుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు సాగుతున్నాయి. అయితే చిరంజీవి స్టామినాకు సరిపోయేలా ఓ పవర్ ఫుల్ కథాంశాన్ని వెంకీ సిద్దం చేశాడట. గతంలో వచ్చిన “ఇంద్ర” సినిమాలో చిరంజీవి పాత్ర ఏ విధంగా అయితే గంభీరంగా ఉంటుందో అలానే మరోసారి చిరంజీవిని చూపించబోతున్నాడట వెంకీ. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :