నితిన్ తో వెంకీ కుడుముల ఇంట్రెస్టింగ్ స్టోరీ ?

నితిన్ తో వెంకీ కుడుముల ఇంట్రెస్టింగ్ స్టోరీ ?

Published on Jan 30, 2023 10:01 AM IST

దర్శకుడు వెంకీ కుడుముల తాజాగా హీరో నితిన్ తో వెంకీ కుడుముల మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పటికే ఈ సినిమా కథ గురించి చాలా రూమర్స్ వచ్చాయి. అయితే, ముఖ్యంగా ఓ ప్రాణాంతకమైన డిసీజ్ తో చావుకి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి కథ ఈ సినిమా కథ అట. మరో నెల రోజుల్లో చనిపోతాను అని తెలుసుకున్న వ్యక్తి ఎలా ఫీల్ అయ్యాడు ?, తన జర్నీని ఎంత హ్యాపీగా మార్చుకున్నాడు?, చుట్టూ ఉన్న జనం అతని పై చూపించే సింపతీకి అతను ఎలా ఇరిటేట్ అయ్యాడు ? అనే కోణంలో వెంకీ కుడుముల ఈ పాయింట్ ను ఫన్నీ వే లో చూపించబోతున్నాడట. ఈ కోణంలోనే ఈ సినిమా సాగుతుందని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

కాగా ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ తారాగణంతో భారీ స్థాయిలో నిర్మించబోతుంది. ఎలాగూ భీష్మ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ తర్వాత సినిమా పై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది. అన్నిటికీ మించి భీష్మ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి.. వెంకీ కుడుముల – నితిన్ ల కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉంటాయి. మరి వీరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు