వెంకీ కుడుముల దర్శకత్వం లో నటించనున్న మెగాస్టార్ చిరంజీవి

Published on Dec 14, 2021 5:17 pm IST

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరికొత్త చిత్రం కి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు వెలువడింది. ఛలో, భీష్మ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని. అయితే ఈ డైరెక్టర్ ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా చేయనున్నారు. డివివి దానయ్య నిర్మాతగా డివివి ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.

అయితే మెగాస్టార్ చిరంజీవి గారి తో సినిమా చేయడం పట్ల నిర్మాత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కల నెరవేరింది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా డాక్టర్ మాధవి రాజు వ్యవహరిస్తున్నారు. అయితే ఈ అవకాశం ఇచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్ తెలిపారు వెంకీ కుడుముల. ఈ చిత్రం కోసం చాలా కష్టపడి పని చేస్తా అని, తనను నమ్మినందుకు థాంక్స్ తెలిపారు వెంకీ కుడుముల. మెగాస్టార్ చిరంజీవి సరికొత్త చిత్రం ప్రకటన తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :