మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో సాలిడ్ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం అభిమానులు మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా అభిమానులు తమ ఎగ్జైట్మెంట్ కి తగ్గట్టుగా అనీల్ రావిపూడి సాలిడ్ ప్లానింగ్ లు చేస్తుండగా ఇటీవల విడుదల చేసిన వెంకీ మామ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ సినిమా టైటిల్ గా ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్షన్ తరహా టైటిల్ వైరల్ గా మారింది. ఆల్రెడీ సినిమా నేపథ్యం కూడా అక్కడిదే అని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగం గానే టైటిల్ ని కూడా లాక్ చేశారట. ఇంతకీ సినిమాకి ఏం టైటిల్ పెట్టారంటే ‘బాల్రెడ్డి బామ్మర్ది’ అనే క్యాచీ టైటిల్ ని పెట్టినట్టు తెలుస్తుంది. సో దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి కూడా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
