“భీమ్లా నాయక్” పై వెంకీ మామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Feb 24, 2022 4:06 pm IST


దగ్గుబాటి వారి యంగ్ హీరో రానా మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ మాస్ సినిమా “భీమ్లా నాయక్” ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి నిన్న వచ్చిన రెండో ట్రైలర్ మరింత హైప్ ని తీసుకొచ్చింది. దీనితో సినీ ప్రముఖులు నుంచి కూడా భీమ్లా నాయక్ పై ప్రశంసలు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మరి ఈ లిస్ట్ లో ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరో రానా దగ్గుబాటి చిన్నాన్న విక్టరీ వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో పోస్ట్ పెట్టడం జరిగింది. రేపు రిలీజ్ అవుతున్న రానా, పవన్ ల భీమ్లా నాయక్ రిలీజ్ పై చాలా ఎగ్జైటింగ్ గా ఉందని, ఈ సినిమా ప్రోమోలు ట్రైలర్ లు ఫెంటాస్టిక్ గా ఉన్నాయని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని వీరు అందుకుంటారని కోరుకుంటున్నానని తెలిపారు. దీనితో పవన్ మరియు దగ్గుబాటి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :