“విరాట పర్వం”లో సాయి పల్లవి నటనపై వెంకీ మామ సాలిడ్ స్టేట్మెంట్.!

Published on Jun 16, 2022 2:50 pm IST


టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి హీరోగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “విరాట పర్వం”. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు మంచి అంచనాలు నెలకొల్పుకొని రేపు విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా కి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ నిన్న అత్యంత ఘనంగా నిర్వహించగా..

ఈ వేడుకలో స్పెషల్ గెస్ట్ గా వచ్చిన వెంకీ మామ హీరోయిన్ సాయి పల్లవిపై ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. సాయి పల్లవికి ఈ చిత్రం తన కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుంది అని ఈ చిత్రంలో సాయి పల్లవి నటనకి డెఫినెట్ గా నేషనల్ అవార్డు వస్తుంది అని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. అయితే ఈ సినిమా ఆల్రెడీ తాను చూశానని చాలా బాగా వచ్చింది అని రైటింగ్, విజువల్స్, నిర్మాణ విలువలు అన్నీ సాలిడ్ గా ఉన్నాయని తెలిపారు.

సంబంధిత సమాచారం :