‘వెంకీ మామ’ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్ !

‘జై లవ కుశ ‘ చిత్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వెంకీ – చైతు కాంబినేషన్ లో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా హైదరాబాద్ లో సెకెండ్ షెడ్యూల్ ను ప్రారంభించింది.

ఈ షూట్ లో రాశి ఖన్నా కూడా పాల్గొంది. ఇక గతంలో ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి అమాంతం పెరిగింది.

కాగా ఈ సినిమాలో వెంకీకి సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version