ఎట్టకేలకు వెంకీమామ గురించి అధికారిక అప్డేట్ వెలుబడింది !

బాబీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య ల కలిసి నటించనున్న మల్టీ స్టారర్ ‘వెంకీమామ’ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయ్యిందని వార్తలు వచ్చాయి. కానీ సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. ఇక ఎట్టకేలకు ఈ షూటింగ్ గురించి అధికారిక సమాచారం వెలుబడింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈనెల 24నుండి ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రంలో వెంకీ కి జోడిగా ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారు. అయితే చైతు సరసన ఎవరు నటించనున్నారో అనే విషయం ఫై క్లారిటీ రావాల్సి వుంది. ఆ పాత్రకు ముందుగా రకుల్ ను తీసుకున్న ఆ తరువాత ఆమెను తప్పించి నాబా నటేష్ ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు చైతూ కు జోడిగా రాశి ఖన్నా ను ఫైనల్ చేశారని టాక్.

కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం దసరా సీజన్ లో విడుదలకానుంది.

Exit mobile version