తలైవర్ టీజర్ ని రిలీజ్ చేయనున్న వెంకీ మామ.!

Published on Oct 23, 2021 11:03 am IST

కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవర్ రజినీ కాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అన్నాత్తే”. కోలీవుడ్ స్టార్ దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి ఇప్పుడు రెడీగా ఉండగా తెలుగులో “పెద్దన్న” అనే టైటిల్ లో రిలీజ్ అవ్వనుంది. మరి ఆల్రెడీ తమిళ్ లో రిలీజ్ అయ్యిన మోషన్ పోస్టర్ టీజర్ లకు భారీ రెస్పాన్స్ రాగా ఇప్పుడు తెలుగు టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రంగం సిద్ధం చేశారు.

తెలుగు వెర్షన్ టీజర్ ను టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరో వెంకీ మామ రిలీజ్ చేయనున్నారట. ఈరోజు సాయంత్రం 5 గంటల వెంకీ మామ పెద్దన్న టీజర్ ను లాంచ్ చెయ్యనున్నారు. ఇక తెలుగు వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్, సీనియర్ హీరోయిన్స్ మీనా, ఖుష్బూలు కీలక పాత్రల్లో నటించారు. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా వచ్చే దీపావళి కానుకగా నవంబర్ 4న భారీ లెవెల్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :

More