గురు లుక్ వెనుక సీక్రెట్ బయట పెట్టిన వెంకటేష్ !

venkatesh
తెలుగు సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. నేడు వెంకటేష్ తన 56 వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా వెంకటేష్ నటిస్తున్న తాజాచిత్రం గురు కి సంభందించిన పోస్టర్ లని వదిలారు. ఈ పోస్టర్ లలో వెంకటేష్ లుక్ ఎన్నడూ లేని విధంగా చాల కొత్తగా ఉంది. ఈ లీక్ వెనుక ఉన్న సీక్రెట్ ని వెంకటేష్ బయటపెట్టాడు.

ఓ తెలుగు వార్తా సంస్థకి తన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెంకటేష్ ఆ విషయాన్ని బయటపెట్టాడు.గురు చిత్రం లో వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా కనిపించనున్నాడు. దానికోసం తన లుక్ ని ఎలా మార్చుకున్నాడా వెంకటేష్ వివరించాడు. ఈ చిత్రం కోసం తన అన్న కొడుకు రానా కి ఫిట్ నెస్ ట్రైనర్ గా పనిచేసిన కనుల్ గిర్ ఆధ్వర్యం లో కొన్ని నెలలపాటు ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకున్నట్లు వెంకీ తెలిపారు. తన ఆహరం లో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు వెంకీ తెలిపారు. గురు చిత్రం లో మరీనా తన లుక్ పట్ల వెంకీ సంతోషాన్ని వ్యక్తం చేసాడు.