మలయాళీ దర్శకుడితో సినిమా చేయనున్న వెంకటేష్

Venkatesh
తెలుగు స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ చాలాకాలం తరువాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘బాబు బంగారం’ చిత్రంతో మంచి విజయాన్నందుకున్నాడు. గతంలో వెంకీ నటించిన ‘దృశ్యం’ చిత్రం ఘన విజయం సాదించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మళయాళంలో జీతు జోసెఫ్ డైరెక్షన్లో మోహన్ లాల్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘దృశ్యం’ ఆధారంగానే తెలుగులోనూ రీమేక్ చేశారు.

ఇప్పుడు వెంకీ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తో కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే జీతూ జోసెఫ్ వెంకీకి కథ చెప్పాడని, వెంకీ కూడా కథ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకురమ్మని జోసెఫ్ కు చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకొన్ని రోజుల్లోనే తెలియనున్నాయి. ప్రస్తుతం వెంకీ తమిళ సినిమా ‘ఇరుద్ది సుత్తురు’ ను తెలుగులోకి రీమేక్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.