త్రివిక్రమ్ చేస్తున్నది రీమేక్ సినిమానా ?

4th, January 2018 - 08:22:01 AM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ‘అజ్ఞాతవాసి’ విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. అవి పూర్తికాగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాని మొదలుపెడతారాయన. అది కూడా పూర్తికాగానే విక్టరీ వెంకటేష్ తో సినిమాను స్టార్ట్ చేస్తారు. గతంలో వెంకీ పుట్టినరోజున ఈ సినిమాని అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం వెంకీతో చేయబోయే ఈ చిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘జాలీ ఎల్.ఎల్.బి’ కి రీమేక్ అని తెలుస్తోంది. చాలా రోజుల క్రితమే హారికా అండ్ హాసిని అధినేత రాధాకృష్ణ ‘జాలీ ఎల్.ఎల్.బి’ యొక్క హక్కుల్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ కావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.