లాంచ్ డేట్ ఫిక్స్ చేసుకున్న వెంకటేష్ సినిమా!

ఈ ఏడాది ‘గురు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకున్న సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని పలు కథల్ని విని చివరికి తేజ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తేజ కూడా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది. ఈ చిత్రానికి అభినందన రామానుజన్ సినిమాటోగ్రఫీ అందివ్వనున్నారు.

ఈ చిత్రాన్ని డిసెంబర్ నెల 13వ తేదీన వెంకటేష్ పుట్టినరోజు సందర్బంగా లాంచ్ చేయనున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ ఒక కాలేజ్ ప్రొఫెసర్ గా కనిపించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్, ఇతర తారాగణం ఎవరు, రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.