కొద్దిగా వెనుకబడిన వెంకీ చిత్రం !

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ దర్శకుడు తేజతో ఒక సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఈ జనవరి నెలలోనే ప్రారంభమవ్వాల్సి ఉండగా అది కాస్త వాయిదాపడి ఫిబ్రవరికి వెళ్ళింది. ఈ విషయాన్ని తేజ స్వయంగా తన ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. అలాగే నటీనటుల వివరాల్ని కూడా త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు.

వెంకటేష్ ప్రొఫెసర్ గా కనిపించనున్న ఈ చిత్రానికి ‘ఆట నాదే వేట నాదే’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రివెంజ్ డ్రామాగా ఉండనున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు, మరొక నిర్మాత అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.