పూరి – వెంకీ ప్రాజెక్ట్ మరోసారి తెరపైకి !

puri-venkatesh1
ప్రస్తుతం ‘గురు’ చిత్రం చేస్తున్న హీరో విక్టరీ వెంకటేష్ తదుపరి సినిమా ‘నేను శైలజా’ ఫేమ్ కిశోర్ తిరుమలలో ఓకే చేశాడు. చిత్ర యూనిట్ ఈ సినిమాకి ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడిందని, వెంకీ పూర్తిగా ఈ ప్రాజెక్టును పక్కనబెట్టారని రకరకాల వార్తలు వచ్చాయి. దీంతో చిత్ర నిర్మాత మల్టీ డైమెన్షన్స్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ మోహన్ రావ్ ‘సినిమా చాలా బాగా జరుగుతోంది, అన్నీ ఒట్టి 2 పుకార్లేనని కొట్టిపారేశారు.

కానీ ఇప్పుడు మళ్ళీ వేరే రకమైన వార్తలు తెరపైకొచ్చాయి. అదేమంటే వెంకీ తన నెక్స్ట్ సినిమాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తాడని, ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని, త్వరలో సినిమా మొదలవుతుందని అంటున్నారు. మరి ఇంతకీ వెంకీ తన తరువాతి సినిమాగా ఏ సినిమాని చేస్తాడో తెలియాలంటే ఈ వార్తలకు సంబందించిన ఎవరో ఒకరు నోరు విప్పేదాకా వేచి చూడాల్సిందే.