వైరల్ అవుతున్న వెంకీ ఓల్డ్ క్యారెక్టర్ గెటప్ !

Published on Sep 25, 2022 11:34 pm IST

విక్టరీ వెంకటేష్ – రానా కలయికలో ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ రాబోతున్న సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ కోసం చేస్తున్న ఈ సిరీస్‌తో వెంకీ గ్రాండ్ గా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే, ఈ సిరీస్ నుంచి నిన్న టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లో వెంకటేష్ గెటప్ అందర్నీ ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేష్ చాలా కొత్తగా ట్రై చేసిన ఈ ‘రానా నాయుడు’ సిరీస్ మంచి హిట్ అవుతుందని సోషల్ మీడియాలో చాలా పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. వెంకటేష్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న ఈ సిరీస్ ప్రముఖ అమెరికన్ షో ‘రే డోనోవన్’ కి రీమేక్. అన్షుమాన్-సుపర్ణ్ వర్మ జంటగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ తేదీ ‘అతి త్వరలో’ అని టీజర్ లో చూపించారు. ఏది ఏమైనా వెంకీ ఇలాంటి ఓల్డ్ ఏజ్ రోల్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. పైగా వెంకీ సినీ కెరీర్ లోనే ఈ రోల్ ప్రత్యేకంగా నిలిచిపోతుందని టాక్ నడుస్తోంది. మరి ఈ సిరీస్ లో వెంకీ నటన ఎలా ఉండబోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :