“రామారావు ఆన్ డ్యూటీ” నుంచి పవర్ఫుల్ రోల్ లో వేణు తొట్టెంపూడి.!

Published on Jul 6, 2022 4:05 pm IST


తెలుగు సినిమా దగ్గర పలు ఇంట్రెస్టింగ్ పాత్రలు కామికల్ అయినా సీరియస్, ఎమోషనల్ అయినా అద్భుతంగా చేసే అతి కొద్ది మంది నటులలో వేణు తొట్టెంపూడి కూడా ఒకరు. మరి ఈ నటుడు చాలా కాలం తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”. మాస్ మహారాజ రవితేజ మరియు నూతన దర్శకుడు శరత్ మందవ కాంబోలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో వస్తుంది.

మరి ఈ సినిమా నుంచి మేకర్స్ అయితే వేణు లుక్ ని చెప్పినట్టుగానే ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రిలీజ్ చేశారు. మరి ఈ లుక్ మాత్రం మాంచి పవర్ ఫుల్ గా ఉందని చెప్పాలి. ఈ సినిమాలో వేణు సీఐ మురళీ అనే పోలీస్ పాత్రలో కనిపించనుండగా ఈ గెటప్ లో అదే చార్మ్ తో తాను కనిపిస్తుండడం విశేషం.

మొత్తానికి అయితే తన రాకతో కూడా ఈ సినిమాపై సాలిడ్ బజ్ నెలకొంది. సినిమాలో ఎంత కీలకంగా తన పాత్ర ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ మరియు రవితేజ లు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :