తన నెక్స్ట్ మూవీ పై వేణు ఉడుగుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jul 20, 2022 11:44 am IST


టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వేణు ఉడుగుల విరాట పర్వం చిత్రం తో ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి ప్రశంసల అందుకున్నారు. తాజాగా ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన సినిమాలలో సామాజిక సమస్యలను చిత్రీకరించడంలో ప్రసిద్ధి చెందిన ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వేణు తన తదుపరి చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని ప్రకటించారు. కథ, స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని దర్శకుడు తెలిపారు. ఇది హీరో సెంట్రిక్ కమర్షియల్ సినిమా అని, ప్రజలు చూడటానికి ఇష్టపడే అన్ని అంశాలతో కూడిన చిత్రమని వేణు వెల్లడించారు. కొత్త సినిమా కల్పిత కథ అని ధృవీకరించారు. హీరో, హీరోయిన్, తదితర మరిన్ని వివరాలను ఈ నెలాఖరున ప్రకటిస్తామని తెలిపారు.

సంబంధిత సమాచారం :