‘నారీ నారీ నడుమ మురారి’ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఇదే !

Nari Nari Naduma Murari

శర్వానంద్ హీరోగా రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’(Nari Nari Naduma Murari). సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న సాయంత్రం ప్రీమియర్ షోలతో ఈ సినిమా విడుదల కానుంది. ఐతే, తాజాగా, చిత్ర నిర్మాతలు ట్రైలర్ విడుదల తేదీని మరియు రిలీజ్ టైమ్ ను ఖరారు చేశారు. ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు ఆత్రేయపురం హైస్కూల్ గ్రౌండ్స్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు, ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరుకానుంది.

కాగా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా ఉండదని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. సునీల్, నరేష్ విజయకృష్ణ, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు సహాయ పాత్రల్లో కనిపించనున్నారు.

Exit mobile version