‘ఉస్తాద్’ నెక్స్ట్ సాంగ్ లాంచ్ కి వేదిక ఖరారు.. ఎక్కడంటే!

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే రెండో సాంగ్ తాలూకా ప్రోమో మంచి రెస్పాన్స్ ని ఫ్యాన్స్ నుంచి అందుకుంటుంది. ఇక ఈ సాంగ్ కోసం మేకర్స్ రంగం సిద్ధం చేశారు. ఈ సాంగ్ ని గ్రాండ్ గా ఈ ఫిబ్రవరి 22న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక దీనికి హైదరాబాద్ లోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీట్ ని వేదికగా ఎంచుకున్నారు. అక్కడ 22న సాయంత్రం 4 గంటల నుంచి హంగామాతో లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో ఆ తర్వాతే ఆన్లైన్ లో ఈ సాంగ్ ని అధికారికంగా మేకర్స్ లాంచ్ చేస్తారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ప్రస్తుతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు తాను చేస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా ఈ మార్చ్ 26న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version