బన్నీ సంక్రాంతి మూవీ అలవైకుంఠపురంలో ప్రీ రిలీజ్ వేడుకకు రంగం సిద్ధమైంది. అందరూ అనుకున్నట్టే వచ్చే నెల 6న ఈ ఈవెంట్ గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. మ్యూజికల్ కాన్సర్ట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ సాయంత్రం 5:00 గంటల నుండి యూసుఫ్ గూడా , పోలీస్ గ్రౌండ్స్ నందు అభిమానుల మధ్య గ్రాండ్ గా జరగనుంది. కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ తెలియజేశారు.
బన్నీ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం కొరకు థమన్ అందించిన మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 12న అల వైకుంఠపురంలో విడుదల కానుంది.
